మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 18:43:49

100కి పైగా కొత్త ఎమోజీలు.. ప్ర‌వేశ‌పెట్ట‌నున్న గూగుల్‌, ఆపిల్‌!

100కి పైగా కొత్త ఎమోజీలు.. ప్ర‌వేశ‌పెట్ట‌నున్న గూగుల్‌, ఆపిల్‌!

జులై 17న ప్ర‌పంచ ఎమోజీ దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జాలు గూగుల్‌, ఆపిల్ 100కి పైగా కొత్త ఎమోజీల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారుల‌కు ఈ కొత్త ఎమోజీలు అందుబాటులోకి వ‌స్తాయి. 55 స్కిన్‌టోన్‌, జెండ‌ర్ వేరియంట్ల‌తోపాటు 62 కొత్త అక్ష‌రాల‌ను గూగుల్ కంపెనీ విడుద‌ల చేస్తున్న‌ది. ఇది త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 11కి ప‌రిచ‌యం కానుంది. విడుద‌ల చేయ‌నున్న కొత్త ఎమోజీల‌లో న‌వ్వుతున్న ముఖం, ఒక వీల్‌లో మ‌నిషి, పాప‌కు ఆహారం తినిపిస్తున్న వ్య‌క్తి, ఇద్ద‌రు వ్య‌క్తులు కౌగిలించుకోవ‌డం, త‌క్సేడోలో మ‌హిళ‌లు, శ‌రీర నిర్మాణ హృద‌యం, టీపాట్‌, బోబా టీ, ఫుడ్ గ్రెయిన్స్‌, లాంగ్ డ్ర‌మ్ వంటి ఎమోజీలు ఉన్నాయి.

కొన్ని ఎమోజీల‌ను డార్క్‌-మోడ్‌లో అందంగా క‌నిపించ‌డానికి వాటికి స‌రికొత్త‌గా తీర్చిదిద్దాలని గూగుల్ ఆస‌క్తి చూపుతున్న‌ది. ఆండ్రాయిడ్ 11 బీటాతో పాటు తాజా జిబోర్డ్ ప్రివ్యూతో యాక్సెస్ ఉన్నవారు ఈ మార్పులను వీక్షించ‌వ‌చ్చు. మరోవైపు, ఆపిల్ కొత్త ఎమోజీలను కూడా తీసుకువస్తుంది. కొత్త వెర్షన్ ఐప్యాడ్‌లు, ఐఫోన్, మాక్‌లలో చేర్చనున్న‌ది. ప్రవేశపెట్టబోయే ఎమోజీలలో డోడో, గూడు బొమ్మలు, తమలే, పినాటా, బూమరాంగ్, నింజా, కాయిన్, బీవర్, ట్రాన్స్‌జెండర్ సింబల్, అనాటమికల్ హార్ట్, బబుల్ టీ, ఊపిరితిత్తులు,  కూడా ఉన్నాయి. గూగుల్, ఆపిల్ రెండూ ప్రవేశపెట్టిన అనేక ఎమోజీలు ఒకేలా ఉన్నాయి. సాధారణంగా ఆపిల్  కొత్త ఎమోజి అక్షరాలను దాని iOS, iPadOS,  macOS నవీకరణలో విడుదల చేస్తున్న‌ది.


logo