సోమవారం 13 జూలై 2020
National - May 03, 2020 , 13:31:38

వ‌ల‌స కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన‌ క‌ర్ణాట‌క‌

వ‌ల‌స కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన‌ క‌ర్ణాట‌క‌

బెంగ‌ళూర్‌: లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ వ‌ల‌స  కార్మికుల‌ను త‌మ సొంత గ్రామాల‌కు చేర్చాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వారిని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. అయితే  వారిని సొంతూళ్ల‌కు తరలించేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసురావాల‌ని...వాటిద్వారా నష్టాలను కొంతలో కొంత భర్తీ చేసుకోవాలని కేఎస్ఆర్టీసీ మొదట్లో భావించింది.ఈ క్ర‌మంలోనే ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంది. దీనిపై వలస కార్మికుల నుంచి తీవ్ర నిరసన రావ‌డంతో వెన‌క్కిత‌గ్గింది. ఉపాధి లేక ఇబ్బందుల పడుతున్న ఈ స‌మ‌యంలో  ఛార్జీలు వసూలు చేయ‌డమేంట‌ని  ప్రశ్నించడంతో కర్ణాటక ప్రభుత్వం ఉచితంగా త‌ర‌లించేందుకు సిద్ద‌మైంది.  వలస కార్మికులు, దినసరి కూలీలను కేఎస్ఆర్టీసీ బస్సుల ఉచితంగా వారి స్వస్థలాలకు తరలించాలని నిర్ణయించింది.నేటి న‌నుంచి మూడు రోజుల పాటు వలస కార్మికులు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఈ ఖర్చును తాము భరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.


logo