శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 22:44:58

ధూమపాన ప్రియులకు శుభవార్త: పాన్‌షాప్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

ధూమపాన ప్రియులకు శుభవార్త: పాన్‌షాప్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

ఢిల్లీ:  కరోనా వైరస్‌ కేసులు 90వేలకు చేరుకుంటున్న వేళ ధూమ పాన ప్రియులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. మే 18వ తేదీ నుంచి నాల్గవ దశ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను వెల్లడించింది. నాల్గవ దశ లాక్‌డౌన్‌ ఇప్పటి వరకు ఉన్నదానికంటే బిన్నంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. లాక్‌డౌన్‌ 4.0 సమయంలో సిగరేట్‌, పాన్‌షాప్‌లు తెరవడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఇది నిజమనిపిస్తుంది. మద్యం, సిగరేట్‌, పాన్‌షాప్‌లు గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లలో తెరిచే ఉంటాయి. కాని వీటిపై కంటైన్మెంట్‌ జోన్లలో తెరవడం నిషేదం కొనసాగుతుంది. కాలేజీలు, స్కూళ్లకు మే 31వరకు అనుమతి లేదు

నూతన మార్గదర్శకాలు..

  • సినిమా థియేటర్లు,  దేవాలయాలు మూసివేత కొనసాగింపు
  • హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం
  • రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు
  • మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్‌
  • దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్‌
  • స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, మే 31వరకు బంద్‌
  • ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • భౌతిక దూరం పాటిస్తూ 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు అనుమతి
  • అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి
  • బార్బర్‌ షాపులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఓపెన్‌ చేసేందుకు  అనుమతి
  • ఆహార పదార్థాలను హోం డెలివరీ చేసేందుకు   రెస్టారెంట్లకు అనుమతి 


logo