మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 13:27:12

పోస్టాఫీసుల ద్వారా జీవన్ ప్రమాణ్ పత్రం..!

పోస్టాఫీసుల ద్వారా జీవన్ ప్రమాణ్ పత్రం..!

ఢిల్లీ: పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పింఛనుదారులకు ఊరటకలిగించింది. ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ పొందే రిటైర్డ్ ఐన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు పెన్షనర్స్  లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.  తాము జీవించి ఉన్నట్లు తెలిపితేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నెలా నెలా ఆయా పింఛన్ ఇస్తారు.కరోనానేపథ్యంలో వయోవృద్ధులైన ఫించన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లడం కాస్త కష్టమే. అందుకోసమే వారికి వెసులుబాటు కల్పముచేందుకు ఈపీఎఫ్ ఓ కీలక నిర్ణయంతీసుకున్నది. 

పోస్టాఫీసు ద్వారా లైఫ్ సర్టిఫికెట్....!

సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్‌వో తాజాగా మరో అవకాశాన్ని కల్పించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.70 చెల్లించి పోస్టాఫీసు ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఈ సర్టిఫికెట్ సమర్పించి పెన్షన్ పొందే సౌలభ్యాన్నిఈపీఎఫ్‌వో  కల్పిస్తున్నది.  

కేవలం 5 నిమిషాల్లో డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు అందిస్తుంది. దీన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించడం ద్వారా ఈపీఎఫ్ పింఛన్‌ను నెలా నెలా అందుకోవచ్చు. గతంలో కొంత నిర్ణీత సమయంలోనే అందజేయాల్సిన లైఫ్ సర్టిఫికెట్‌ను డిసెంబర్ లోగా ఏడాదిలో ఎప్పుడైనా సమర్పించవచ్చునని ఇటీవల వెసులుబాటు కల్పించింది. తాజాగా ఆన్‌లైన్ ద్వారా, పోస్టాఫీసు ద్వారా, బ్యాంకుల ద్వారా వికలాంగులు, వృద్ధులు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించి ప్రతినెలా ఏ ఇబ్బంది లేకుండా పింఛన్ పొందవచ్చు. చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఫెయిల్...!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.