మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 20:06:44

పేటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్...!

 పేటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్...!

బెంగళూరు: పేటీఎం వినియోగదారులకు ఆ సంస్థ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గుడ్ న్యూస్ అందించారు. ఇక నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి చార్జీలు ఉండబోవని ఆయన ప్రకటించారు.  పేటీఎం తమ కస్టమర్స్ మాములుగా వాలెట్‌ లోని డబ్బులను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే కొంత మొత్తంలో చార్జీలు వసూలు చేసేది. ఇక నుంచి ఈ చార్జీలను తొలగిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ ఆన్‌లైన్ ద్వారా  వెల్లడించారు. ఆ చార్జీలను తొలగిస్తుండడంతో పేటీఎం వాడే వారికి మరింత ప్రయోజనం కలుగనున్నది. ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు.

పేటీఎం యూజర్‌కు విజయ్ శేఖర్ శర్మ ఈ విషయంపై సమాధానం ఇచ్చారు. పేటీఎం వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌ కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మీరు విధించే 5 శాతం ఫీజును తొలగిస్తే ఏమౌతుందని ఒక పేటీఎం యూజర్ ప్రశ్నించగా... ఈ ప్రశ్నకు విజయ్ శేఖర్ శర్మ సమాధానమిచ్చారు. ఇకమీదట ఈ చార్జీలు ఉండబోవని, వారు ఈ చార్జీలు పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ ఇక్కడ క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకొక తప్పదు. దీనికి 2 శాతం చార్జీలు వసూలు చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.