బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 17:50:04

పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్...?

 పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్...?

ఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పింఛన్ దారులకు గుడ్ న్యూస్ అందించేందుకు సిద్దమవుతున్నది. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన చేసింది. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సుముఖంగా ఉన్నది. దీపావళి నాటికి పెన్షన్ పెంపు నిర్ణయం ప్రటకన ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్‌ పెంపు నిర్ణయం తీసుకుంటే చాలా మందికి ఊరట కలుగనుంది. కనీస పెన్షన్‌ను రెట్టింపు చేయొచ్చని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు కనీస పెన్షన్ రూ.1,000గా ఉంది. దీన్ని ఆర్థిక శాఖ రెట్టింపు అంటే రూ.2,000కు పెంచొచ్చన తెలియజేశాయి. కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రెట్టింపు చేస్తే రూ.2000-రూ.2,500 కోట్ల వరకు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇకపోతే పీఎఫ్ చందాదారులు మాత్రం కనీస పెన్షన్‌ను రూ.3,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వపు పెన్షన్ పెంపు నిర్ణయంతో దాదాపు 60 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.

కాగా ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం.. ఉద్యోగుల వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) కట్ అయ్యి..ఈ మొత్తం పీఎఫ్ అకౌంట్‌లో జమవుతుంది. కంపెనీ కూడా ఇదే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ఉద్యోగి 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్ అకౌంట్‌కు వెళ్తుంది. ఉద్యోగికి 58ఏండ్లు దాటిన తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. భరణం చెల్లింపు పై సుప్రీం కోర్టు నూతన మార్గదర్శకాలు...