శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 14:44:14

సామాజిక దూరం.. అంద‌రికి ఆద‌ర్శం

సామాజిక దూరం.. అంద‌రికి ఆద‌ర్శం

క‌రోనాకి వ్యాక్సిన్ లేదు, మందు అంతక‌న్నా లేదు. నివార‌ణ ఒక్క‌టే మార్గం. ప‌రిశుభ్ర‌త‌తో పాటు సామాజిక దూరం పాటిస్తే క‌రోనాని వీలైనంత తొంద‌ర‌గా త‌రిమికొట్టొచ్చ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌. వీటిని కొంద‌రు బాధ్య‌తాయుతంగా పాటిస్తున్నారు. వివ‌రాల‌లోకి వెళితే విజ‌య‌వాడ‌లో కూర‌గాయ‌ల అమ్మ‌క‌దారులు ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా  ప‌లు ఏర్పాట్లు చేశారు. మ‌నిషికి మ‌నిషికి దూరం ఉండేలా బాక్స్‌ల‌ని గీసి ప్ర‌జ‌లని అందులో నిలుచోవాల‌ని కోరుతున్నారు.

ఇక‌ కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌లు  కూడా ముఖానికి మాస్క్‌లు ధ‌రించి ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో బాక్స్‌ల‌లో నిలుచున్నారు. సామాజిక దూరం పాటిస్తూ బాక్స్‌ల‌లో నిల్చొని కూర‌గాయ‌లు కొనుక్కుంటున్నారు. వీరి క్ర‌మ‌శిక్ష‌ణ‌పై విజ‌య‌వాడ ఐపీఎస్ ఆఫీస‌ర్ గోపాల్ కృష్ణ ద్వివేది ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కూరగాయల అమ్మకం కోసం విజయవాడ జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్ర‌య‌త్నం చాలా బాగుందని త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌లోను కొన్ని షాపుల ముందు స‌ర్కిల్స్ ఏర్పాటు చేసి మ‌నిషి మ‌నిషికి దూరంలా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరంతోనే సుర‌క్షితంగా ఉంటామ‌నే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క గ‌మ‌నించాలి.


logo