మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 12:19:03

అతివేగం ప్ర‌మాద‌క‌రం.. మ‌నిషి సేఫ్! బైక్ మాయం

అతివేగం ప్ర‌మాద‌క‌రం.. మ‌నిషి సేఫ్! బైక్ మాయం

మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం. అతివేగం ప్ర‌మాద‌క‌రం. ఇలా ఎన్ని సూక్తులు చెప్పినా విన‌రుగా. కుర్ర‌కారుకు స్పోర్ట్స్‌ బైక్ దొరికితే వ‌దులుతారా? ర‌య్ ర‌య్‌మంటూ ఆగ‌మేఘాల మీద వెళ్ల‌రూ. వెళ్తే ప‌ర్వాలేదు. వీరికి హాని జ‌ర‌గ‌డంతోపాటు ఎదుటివారికి కూడా హాని చేస్తారు. ఎవ‌రికేం జ‌రిగినా ప‌ర్వాలేదు. బైక్ మీద ఎంజాయ్ చేయాల్సిందే అని ఓ యువ‌కుడు స్పోర్ట్స్ బైక్ మీద రెచ్చిపోయాడు.

వీడియోలో చూసిన‌ట్ల‌యితే హైవే మీద వెళ్తున్న‌ట్లున్నాడు. కార్లు నార్మ‌ల్ స్పీడ్‌లో వెళ్తుంటే ఇత‌ను మాత్రం రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. అత్యంత వేగంగా ప్ర‌యాణిస్తూ బైకును గాల్లోకి లేపి స్టంట్ చేయాల‌నుకున్నాడు. అది ప‌ట్టుత‌ప్ప‌డంతో బైక్ స్కిడ్ అయి బైక‌ర్ కింద‌ప‌డ్డాడు. అంత వేగం మీద వెళ్తున్న అత‌ను ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌డం గ‌మ‌నార్హం. పాపం బైక్ మాత్రం ముక్క‌లు ముక్క‌లైపోయింది. ప‌డ్డ‌త‌ను లేచి దుమ్ము దులుపుకొని చూసేస‌రికి బైక్ లేదు. మొత్తం స్మాష్‌. logo