బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 19:04:02

బంగారం, వెండితో మాస్కుల తయారీ

బంగారం, వెండితో మాస్కుల తయారీ

చెన్నై: కరోనా నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బంగారం, వెండితో వినూత్నంగా మాస్కులు తయారు చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన స్వర్ణకారుడు రాధాకృష్ణన్ సుందరం ఆచార్య .. బంగారం, వెండి దారాలతో వీటిని రూపొందిస్తున్నారు. 18 క్యారెట్ల బంగారంతో చేసిన మాస్కు ధర రూ.2.75 లక్షలు, వెండితో చేసిన మాస్కు ధర రూ.15,000 అని ఆయన చెప్పారు. గోల్డ్, సిల్వర్‌తో తాను చేసిన మాస్కులు చాలా మందికి నచ్చాయని, తమకు కూడా అలాంటివి తయారు చేయాలని పలువురు కోరుతున్నారని అన్నారు.

బంగారం, వెండి పోగులతో తయారు చేస్తున్న మాస్కుల కోసం ఇప్పటి వరకు 9 ఆర్డర్లు వచ్చాయని స్వర్ణకారుడు రాధాకృష్ణన్ సుందరం ఆచార్య తెలిపారు.
logo