మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 14:58:15

లక్నోవిమానాశ్రయంలో 2కోట్ల విలువైన బంగారం స్వాధీనం

లక్నోవిమానాశ్రయంలో 2కోట్ల విలువైన బంగారం స్వాధీనం

లక్నో: లక్నోవిమానాశ్రయంలో 2కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన  లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు రూ. 2 కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జీ8 6451 విమానంలో లక్నో వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో బంగారం దొరికింది.

మొత్తం 33 గోల్డ్ బిస్కెట్లను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గోల్డ్ 3,849.12 గ్రాములని, మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 2 కోట్ల 9 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, నిందితుడు గోల్డ్ బిస్కెట్లను సెల్లోటేప్‌లో చుట్టి, అతని అండర్ గార్మెంట్‌లోని నల్ల రంగు పర్సులో దాచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo