గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 15:30:57

గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు.. 3వ‌సారి శివ‌శంక‌ర్‌ విచారణ‌

గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు.. 3వ‌సారి శివ‌శంక‌ర్‌ విచారణ‌

 హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ కేసులో సీఎం విజ‌య‌న్ వ‌ద్ద కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన మాజీ సీఎస్ శివ‌శంక‌ర్‌ను ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు.  కొచ్చి ఆఫీసులో ఇవాళ విచార‌ణ కొన‌సాగుతున్న‌ది. బంగారం స్మ‌గ్లింగ్ కేసులో శివ‌శంక‌ర్‌ను విచారించ‌డం ఇది మూడ‌వ సారి. స్మ‌గ్లింగ్ కేసులో ఇప్ప‌టికే స్వ‌ప్నా సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో ఆరోప‌ణ‌లు రావడంతో శివ‌శంక‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. అత‌ని వ‌ద్ద‌ సీజ్ చేసిన డిజిట‌ల్ ఆధారాల‌తో ఎన్ఐఏ పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. డిజిట‌ల్ ఆధారాల కార‌ణంగా తాము కూడా శివ‌శంక‌ర్‌ను విచారించ‌నున్న‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది. ఈ కేసులో 2టీబీ డేటాను సేక‌రించిన‌ట్లు ఎన్ఐఏ చెబుతున్న‌ది. బంగారం స్మ‌గ్లింగ్ కేసులోనే విద్యాశాఖ మంత్రి కేటీ జ‌లీల్‌ను కూడా ఎన్ఐఏ విచారించింది.  అక్ర‌మంగా 250 కిలోల బంగారాన్ని త‌ర‌లించిన‌ట్లు నిందితుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.



logo