ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 19, 2020 , 19:07:02

మరింత త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

మరింత త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధ‌ర‌లు మరింత త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.248 త‌గ్గి రూ.49,714కు చేరింది. గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.49,962 వ‌ద్ద ముగిసింది. ఇక వెండి ధ‌ర కూడా గురువారం స్వ‌ల్పంగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.853 త‌గ్గి రూ.61,184కు చేరింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.62,037 వ‌ద్ద ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1861 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 24.02 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.