మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 10:55:23

కోజికొడ్‌, కోల్‌క‌తా ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం ప‌ట్టివేత‌

కోజికొడ్‌, కోల్‌క‌తా ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం ప‌ట్టివేత‌

తిరువ‌నంత‌పురం/కోల్‌క‌తా : కేర‌ళ‌లోని కోజికొడ్ ఎయిర్‌పోర్టులో, బెంగాల్‌లోని నేతాజి సుభాష్ చంద్ర‌బోస్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. కోజికొడ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో 2,601 గ్రాముల బంగారాన్ని ఐదుగురు ప్ర‌యాణికుల నుంచి క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మ‌రో ఆరుగురు ప్ర‌యాణికుల వ‌ద్ద ఉన్న 59 వేల విదేశీ సిగ‌రెట్ల‌ను ప‌ట్టుకున్నారు. మ‌రో ప్ర‌యాణికుడి నుంచి 624 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

నేతాజి సుభాష్ చంద్ర‌బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో చాక్లెట్ క‌వ‌ర్ల‌లో దాచిపెట్టి ఉంచి 531.20 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ. 27,62,240 ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. బంగారం క‌లిగి ఉన్న ప్ర‌యాణికుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.