సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 14:37:14

మళ్లీ పెరిగిన బంగారం ధరలు....

మళ్లీ పెరిగిన బంగారం ధరలు....

ముంబై: బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు పెరిగిన ధరలు నిన్న తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభ సెషన్‌లో తిరిగి బలపడ్డాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి రూ.51,571 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.4 శాతం పెరిగి రూ.68,405 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం తగ్గింది. వెండి 0.7 శాతం క్షీణించింది. గత మూడు వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీన పసిడి ధరలు రూ.56,200 పలికిన విషయం తెలిసిందే. ఆ ధరతో ఇప్పటికీ రూ.రూ.4,600 కంటే పైన తక్కువగా ఉంది.

ఎక్కడెక్కడ ఎంతెంత..? 

 హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.53,600 దిగువన పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.49వేల పైన పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.54,650, 22 క్యారెట్ల బంగారం రూ.50,100 పలికింది. వెండి ధర రూ.67,800 పలికింది.

ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ స్వల్పంగా పెరుగుదల...  

 అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్ 1,951.13 పలికింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్షీణించింది. దీంతో బంగారం ధరపై ప్రభావం పడింది. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం మేర పడిపోయింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.5 శాతం పడిపోయి ఔన్స్ 26.97 డాలర్లు, ప్లాటినమ్ 0.4 శాతం పడిపోయి 936 డాలర్లు పలికింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ ఈటీఎప్ వద్ద గోల్డ్ నిల్వల్లో మార్పు లేదు. 1247.69 టన్నులుగా ఉన్నది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo