గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 16:18:09

గోల్డ్ ఆర్నమెంట్స్ హాల్ మార్కింగ్ గడువు పొడిగింపు

గోల్డ్ ఆర్నమెంట్స్ హాల్ మార్కింగ్ గడువు పొడిగింపు

ఢిల్లీ : బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ కు సంబంధించి కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి అనే నిబంధన గడువును పొడిగించింది. 2021 జూన్ 1వ తేదీకి పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే నిబంధనను మరికొద్ది నెలలు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. వ్యాపారుల అభ్యర్థన మేరకు జనవరి 15, 2021కి బదులు జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. తొలుత దీనిని 2021 జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని గతేడాది నవంబర్ నెలలో ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో గడువును పొడిగించింది. అప్పటిలోగా జ్యువెల్లర్స్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ ( బిఐఎస్) వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల ఆభరణాల విక్రయానికే అనుమతిస్తామని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం హాల్ మార్కింగ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏడాది క్రితమే కేంద్రం ఆదేశించింది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (ఏజీ జె డీసీ) ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ హాల్ మార్కింగ్ పొడిగింపు కోసం కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

కరోనా, లాక్ డౌన్ కారణంగా జ్యువెల్లరీ షాప్ యజమానులు మూడు నెలలు భారీగా నష్టపోయారని, ఇది కోలుకోవడానికి మరో మూడు నుంచి నాలుగు నెలలు పట్టే అవకాశమున్నదని  కాబట్టి హాల్ మార్కింగ్ లేని జ్యువెల్లరీ మిగిలిపోయే అవకాశం ఉందని ఏజీ జెడీసీ వైస్ చైర్మన్ శంకర్ సేన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. బిఐఎస్2000 సంవత్సరం నుంచి బంగారు ఆభరణాల కోసం హాల్ మార్కింగ్ స్కీంను రన్ చేస్తున్నది. ప్రస్తుతం 40 శాతం బంగారు ఆభరణాలు హల్ మార్క్ చేస్తున్నారు. బిస్‌లో 28,849 మంది జ్యువెల్లర్స్ రిజిస్టర్ అయ్యారు. హాల్ మార్క్ బంగారం స్వచ్ఛతకు ధ్రవీకరణ. ఇది కొనుగోలుదారులకు ప్రయోజనం. వారు మోసపోకుండా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.


  

తాజావార్తలు


logo