మంగళవారం 31 మార్చి 2020
National - Feb 27, 2020 , 12:38:14

తమిళనాడులో 505 బంగారు నాణేలు లభ్యం

తమిళనాడులో 505 బంగారు నాణేలు లభ్యం

చెన్నై : తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని జంబుకేశ్వర్‌ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు నిన్న తవ్వకాలు జరిపారు. కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. వారికి ఇనుముతో చేసిన కుండ తగిలింది. దీంతో ఆ కుండను వెలికి తీసి చూడగా.. అందులో 505 బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆలయ అధికారులు శ్రీరంగం తహసిల్డార్‌ ఆర్‌. శ్రీధర్‌కు సమాచారం అందించారు. తహసిల్దార్‌ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు నాణేల బరువు 1.716 కేజీలు ఉన్నట్లుగా శ్రీధర్‌ తెలిపారు. అయితే ఈ బంగారు నాణేలను ఆర్కియాలజీ అధికారులకు అప్పగిస్తామని తహసిల్దార్‌ చెప్పారు.  


logo
>>>>>>