బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 21:59:55

చెన్నై ఎయిర్‌ పోర్టులో బంగారం పట్టివేత..

చెన్నై ఎయిర్‌ పోర్టులో బంగారం పట్టివేత..

తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్‌ నుంచి చెన్నైకి చేరుకున్న ఓ ప్రయాణికుడిని ఎయిర్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి కదలికలు, నడవడిక అనుమానాస్పదంగా ఉండడంతో ప్రయాణికుడి లగేజీని అధికారులు సోదా చేశారు. ఈ తనిఖీలో సదరు ప్రయాణికుడి వద్ద 1.4 కేజీల బంగారం లభించింది. అతడిని అరెస్ట్‌ చేసిన అధికారులు, బంగారాన్ని సీజ్‌ చేసి.. స్మగ్లర్‌ను విచారిస్తున్నారు. కాగా, అతడి వద్ద లభించిన బంగారం విలువ 63.74 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

<


logo
>>>>>>