మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:58:33

బంగారం ,వెండి ధరలు పై పైకి ...

 బంగారం ,వెండి ధరలు పై పైకి ...

ఢిల్లీ : దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగి పోతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.710 పెరిగి.. రూ. 65,540కి చేరింది. కిలో వెండి ధర రూ. 313 ఎగబాకి.. రూ. 65,540 వద్ద స్థిరపడింది. అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయ ప్రకటన కోసం మదుపరులు వేచి చూస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,958 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సుకు 24.27 డాలర్లుగా ట్రేడ్ అవుతున్నది.


logo