సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 11:51:20

సీఎం యడ్యూరప్పకు కోర్టు సమన్లు

సీఎం యడ్యూరప్పకు కోర్టు సమన్లు

బెళగావి: గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై గోకక్‌లోని జేఎంఎఫ్‌సీ కోర్టు ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది. నవంబర్ 23న గోకక్‌లోని వాల్మీకి స్టేడియంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో వీరశైవ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను సీఎం పిలిచి వారి ఓట్లు చీలిపోవద్దని పిలుపునిచ్చారు. లింగాయత్ వీరశైవ ఆధిపత్య వర్గాలలో ఒకటైన గోకక్‌లోని వీరశైవ ఓటర్లను సంఘటితం చేసేందుకు ఆయన ప్రయత్నించారు.

అయితే గోకక్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి, సీఎంపై కేసు నమోదు చేసిన సందర్భంలో బీ-రిపోర్ట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు బీ-నివేదికను తిరస్కరించి సీఎంకు సమన్లు జారీ చేసింది.  గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమే‌శ్‌ శార్కిహోళి తన సమీప ప్రత్యర్థి లఖన్ జార్కిహోళిని ఓడించి ఘన విజయం నమోదు చేయడం తెలిసిందే. జార్కిహోలి సంప్రదాయ బీజేపీ ఓటర్ల మద్దతుతో వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo