గొగొయ్ సొంత కుమారుడిలా చూసుకునేవాడు : రాహుల్ గాంధీ

గౌవహతి : దివంగత అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తరుణ్ గొగొయ్ తనను సొంత కుమారుడిలా చూసుకునేవాడని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ గుర్తు చేసుకున్నారు. బుధవారం గౌవహతిలో తరుణ్ గొగొయ్‌కు ఆయన నివాళులర్పించారు. గొగొయ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ గొగొయ్ తనతో నిత్యం అస్సాం, ఆ రాష్ట్ర ప్రజల గుర్తించే మాట్లాడుతుండే వారిని అన్నారు.
ఇవాళ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మాద్ పటేల్ సైతం కోల్పోవడంతో కాంగ్రెస్‌లో మరో మూలస్తంభం కూలిపోయిందని.. ఇది చాలా విచారణకరమైన రోజని అన్నారు. తరుణ్ గొగొయ్ తీవ్ర అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను గురువారం నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.