శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 15:07:13

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ నుంచి అత్యధిక దిగుబడులు అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలు

 గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ నుంచి అత్యధిక దిగుబడులు అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలు

ఢిల్లీ: గోద్రేజ్‌ అగ్రోవెట్‌ అధిక దిగుబడులు అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలను విడుదల చేసింది. మలేషియా నుంచి సేకరించిన సేమీ క్లోనల్‌ విత్తనాల ద్వారా వీటిని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సీఈవో,  నసీమ్‌ అలీ మాట్లాడుతూ ‘‘పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే వ్యవసాయ సమస్యలు నేరుగా రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతాయి. గత మూడు దశాబ్దాలుగా భారతీయ రైతులకు సేవలనందించడంలో ముందున్న గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ స్ధిరంగా వినూత్నమైన పరిష్కారాలను అందిస్తూనే ఉంది. ఈ నూతన వెరైటీ ఆయిల్‌ పామ్‌ కింద ఈ అక్టోబర్‌ –నవంబర్‌ 2020లో ఆంధ్రప్రదేశ్‌లో 160 నుంచి 170 హెక్టార్లలో సాగును చేయగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. ఈ మొక్కలను ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఫ్యాక్టరీ జోన్‌ కింద ఉన్న రైతులకు పంపిణీ చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.