సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 08:28:24

బ‌క్రీద్‌కు ఆన్‌లై‌న్‌లో మేక‌లు

బ‌క్రీద్‌కు ఆన్‌లై‌న్‌లో మేక‌లు

ముంబై: త్యాగనిర‌తికి, దాన‌గుణానికి ప్ర‌తీకగా ముస్లిం సోద‌రులు బ‌క్రీద్ (ఈద్ ఉల్ అధా) పండుగ‌ను జ‌రుపుకొంటారు. పండుగ సంద‌ర్భంగా మేక‌లు, గొర్రెలను మ‌రొక‌రికి దానంగా ఇచ్చి అల్లాపై త‌మ భ‌క్తిభావాన్ని చాటుకుంటారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది జ‌న‌స‌మ్మ‌ర్ధ‌మైన ప్రాంతాల్లో గొర్రెలు లేదా మేక‌ల‌ను కొనే ప‌రిస్థితి లేదు. దీంతో ముంబై‌లోని వ్యాపారులు ఆన్‌లైన్ బాట‌ప‌ట్టారు. ఆ‌లైన్‌లో మేక‌లను ఆర్డ‌ర్ చేస్తే వాటిని నేరుగా ఇంటికే తెచ్చిస్తామ‌ని జోగేశ్వ‌రీలోని హాజి మేక‌ల మండి వ్యాపారులు ప్ర‌క‌టించారు. 

క‌రోనా నేప‌థ్యంలో మార్కెట్‌లో జ‌నాలు గుమికూడ‌కుండా, ఆన్‌లైన్‌లో మేక‌ల ఫొటోల‌ను చూసి, వారు ఎంపిక చేసుకున్న‌ వాటిని వినియోగ‌దారుల ఇంటివ‌ద్ద‌ ఇస్తామ‌ని వ్యాపారి వాసిమ్ ఖాన్ చెప్పారు.  ‌


logo