మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Mar 26, 2020 , 10:24:09

గోవాలో తొలిసారిగా 3 కరోనా కేసులు నమోదు

గోవాలో తొలిసారిగా 3 కరోనా కేసులు నమోదు

పనాజీ : గోవాలో తొలిసారిగా మూడు కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. స్పెయిన్‌, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ ముగ్గురికి పనాజీలోని గోవా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ముగ్గురు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో, వారు పర్యటించిన ప్రాంతాలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ ముగ్గురితో కలిసి తిరిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతామని గోవా సీఎం పేర్కొన్నారు. కరోనా సోకిన వారి వయస్సు 25 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.