గురువారం 28 మే 2020
National - May 18, 2020 , 15:24:28

గోవాలో కరోనా టెస్టుకి రూ. 2వేలు

గోవాలో కరోనా టెస్టుకి రూ. 2వేలు

ఒక్క క‌రోనా కేసు కూడా లేని రాష్ట్రంగా గోవా పేరు మారుమోగింది. వేస‌వి తాపానికి త‌ట్టుకోలేని ప్ర‌జ‌లంద‌రూ  గోవాకి ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. ఇంకేముంది అక్క‌డ కూడా క‌రోనా విజృంభించింది. దీంతో గోవా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌మ రాష్ట్రంలోకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించింది. అంతేకాదు ప‌రీక్ష‌ల కోసం ఒక్కొక్క‌రి నుంచి రూ. 2 వేలు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది.

 గోవాలో మే 17 వరకు 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి రైల్లో వచ్చిన ఏడుగురికి, కర్ణాటక నుంచి వచ్చిన వలస కార్మికునికి పరీక్షలు చేయగా పాజిటీవ్‌ వచ్చింది. మే 12వరకు గోవాలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. 


logo