శనివారం 28 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 12:04:41

తెరుచుకున్న పాఠశాలలు

తెరుచుకున్న పాఠశాలలు

పనాజీ : కొవిడ్‌ మహమ్మారి కారణంగా గోవాలో మూతపడిన పాఠశాలలు శనివారం తిరిగి తెరుచుకున్నాయి. సుమారు ఎనిమిది నెలల తర్వాత పది, 12 తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, చేతులు శుభ్రపరచడం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూర నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల 10, 12 తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పక్కాగా పాటించాలని సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఆదేశించించారు.

పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించే ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలను సంప్రదించినట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు పరీక్షలు చేసేందుకు థర్మల్‌ గన్‌లను ఏర్పాటు చేశామని, చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. మొదటి రోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కేవలం 50 శాతం మంది చొప్పున విద్యార్థులను పాఠశాలకు వచ్చేలా చూస్తున్నామని, మిగతా వారిని వచ్చేవారం నుంచి పిలుస్తామని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం సిలబస్‌ను 30శాతం తగ్గిస్తామని గోవా బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ అండ్‌ హయ్యర్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ ఇప్పటికే ప్రకటించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.