గురువారం 26 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 15:00:55

మంగ‌ళ‌సూత్రం ధ‌రించిన మ‌హిళ‌ల‌ను కుక్క‌ల‌తో పోల్చిన ప్రొఫెస‌ర్‌

మంగ‌ళ‌సూత్రం ధ‌రించిన మ‌హిళ‌ల‌ను కుక్క‌ల‌తో పోల్చిన ప్రొఫెస‌ర్‌

ప‌నాజీ : మ‌హిళ‌ల మంగ‌ళ‌సూత్రాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన గోవాకు చెందిన ప్రొఫెస‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. స్థానిక వి.ఎం.సాల్గోక‌ర్ కాలేజీ ఆఫ్ లా లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసే శిల్పా సింగ్ మంగ‌ళ‌సూత్రం ధ‌రించిన మ‌హిళ‌ల‌ను గొలుసుల‌తో క‌ట్టేసిన కుక్క‌ల‌తో పోల్చారు. ఈ వ్యాఖ్య‌ల‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. మ‌తప‌ర‌మైన భావాల‌ను ప్రొఫెస‌ర్ ఉద్ధేశపూర్వ‌కంగా అవ‌మానించార‌ని, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంపై రాష్ర్టీయ హిందూ వాహిని స‌భ్యుడు ప‌నాజీ రెండ‌వ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 295 ఏ కింద శిల్పా సింగ్‌పై  ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారు.