బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 10:08:56

గోవా సెంట్రల్‌ జైలు నుంచి ఖైదీ పరారీ!

గోవా సెంట్రల్‌ జైలు నుంచి ఖైదీ పరారీ!

పనాజీ : 42 ఏళ్ల బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ.. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వ్యక్తి గోవా సెంట్రల్‌ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. రామ్‌చంద్రన్ యెలప్ప అనే వ్యక్తి 2018లో దక్షిణ గోవాలోని కెనకోనాలో బ్రిటిష్ జాతీయురాలిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. కాగా, జైలు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా సదరు నిందితుడు ప్రధాన ద్వారా గుండా బయటకు వెళ్లలేదని తెలింది.

కాంప్లెక్స్‌లో వచ్చి వెళ్లేందుకు ఇది ఒక్కటే దారి. నార్త్‌ వైపునున్న ప్రహరీ గోడ దూకి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. పలుసార్లు ఆ ప్రాంతంలో ఖైదీలకు అప్పుడప్పుడు రోజువారీ పనులు ఇస్తుంటారు. లేదంటే జైలు కాంప్లెక్స్‌లోనే దాక్కుని ఉండవచ్చని, ఎత్తయిన గోడ దూకి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, ప్రధాన ద్వారం గుండా వెళ్లలేదు కాబట్టి కాంప్లెక్స్‌లోనే ఉండవచ్చని భావిస్తున్నట్లు జైలు అధికారి ఒకరు చెప్పారు. యెలప్ప కస్టడీ నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారు కాదు.

గతేడాది జూన్‌లో కోర్టుకు హాజరు కాగా.. కోర్టు కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లోని వెంటిలెటర్‌ గాజు పలకను తొలగించి తప్పించుకున్నాడు. అనంతరం మళ్లీ అరెస్టు చేశారు. డిసెంబర్‌, 2018లో 42 ఏళ్ల బ్రిటిష్‌ మహిళ సౌత్‌ కెనకోనాలోని రైల్వేస్టేషన్‌ నుంచి వస్తుండగా నిందితుడు అత్యాచారం చేసి, రూ.20వేల నగదు దోచుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని యెల్లప్పగా గుర్తించిన గోవా పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo