శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 02:21:01

గోవాలోకి పర్యాటకులకు అనుమతి

గోవాలోకి పర్యాటకులకు అనుమతి

పనాజీ, జూలై 1: గోవాలోకి దేశీయ పర్యాటకులను గురువారం నుంచి అనుమతించనున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి మనోహర్‌ అజాంక్కర్‌ తెలిపారు. పర్యాటకుల కోసం 250 హోటళ్లను అనుమతించినట్టు చెప్పారు. పర్యాటకులు తమ వెంట కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తెచ్చుకోవాలని, లేకపోతే పరీక్షలు నిర్వహించి ఫలితం వచ్చే వరకు క్వారంటైన్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన హోటళ్లలో బస చేయడానికి పర్యాటకులు ముందుగానే గదులను బుకింగ్‌ చేసుకోవాలన్నారు.


logo