గురువారం 28 మే 2020
National - May 23, 2020 , 15:23:59

స్వ‌దేశీ ప‌ర్యాట‌కులకు గోవా ఆహ్వానం..

స్వ‌దేశీ ప‌ర్యాట‌కులకు గోవా ఆహ్వానం..

  

హైద‌రాబాద్‌: గోవాలో మ‌ళ్లీ దేశీయ ప‌ర్యాట‌కుల తాకిడి మొద‌ల‌వుతుంద‌ని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  కోవిడ్ నేప‌థ్యంలో గోవాలో భ‌విష్య‌త్ టూరిజంపై ఆయ‌న కామెంట్ చేశారు. గోవాలో క‌రోనా వైర‌స్ కేసులు లేవ‌ని, విదేశీ టూరిస్టులు కూడా గోవాకు వ‌స్తార‌ని, కానీ దానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఇదేమీ దీర్ఘ‌కాలిక న‌ష్టం కాద‌న్నారు.  జ‌మ్మూక‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో.. రాజ్‌భ‌వ‌న్‌ను ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులోకి తెచ్చాన‌ని స‌త్య‌పాల్ తెలిపారు. వారానికి ఒక‌సారి ఫిర్యాదు స్వీక‌రించేవాళ్ల‌మ‌న్నారు.  అలా త‌మ ఆఫీసు సుమారు 95వేల ఫిర్యాదు స్వీక‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గోవాకు రావ‌డానికి ముందు సుమారు 93 వేల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఫిర్యాదు ప‌రిష్క‌రించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ఆవేశం త‌గ్గింద‌న్నారు.  ప్ర‌ధాని ఆదేశాల మేర‌కు క‌శ్మీర్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌ఘ్నంగా నిర్వ‌హించామ‌న్నారు.  ఒమ‌ర్‌, మెహ‌బూబా ముఫ్తీలు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు వ్య‌తిరేకించారు, ఉగ్ర‌వాదులు కూడా బెదిరించారు, కానీ తాము విజ‌య‌వంతంగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. logo