గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 27, 2020 , 17:42:52

గోవా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్‌

గోవా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్‌

పనాజీ : దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి దేశాధి నేతల వరకు ఎవ్వరినీ వైరస్‌ మహమ్మారి వదలడం లేదు. తాజాగా గోవా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ జోస్ డిసా కరోనా బారినపడ్డారు. ఇవాళ ఆయన యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేరినట్లు పేర్కొన్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు విశేష కృషి చేస్తోంది. ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ వైరస్‌ బారినపడటంతో  ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందించారు. ‘మహమ్మారిపై పోరాటంలో యంత్రాంగం గందరగోళంలో ఉంది. ఆరోగ్యశాఖ డైరెక్టరే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం ప్రజారోగ్య సంరక్షణపై ప్రభుత్వ సన్నద్ధకు అద్ధం పడుతోంది. అందరి శ్రేయస్సు కోసం భగవంతుడిని ప్రార్థిస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.