శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 11:33:20

గోవాలో తొలి కరోనా మరణం

గోవాలో తొలి కరోనా మరణం

పనాజి: గోవాలో సోమవారం తొలి కరోనా మరణం నమోదైంది. మోర్లెమ్‌కు చెందిన 85 ఏండ్ల మహిళకు కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం చనిపోయినట్లు గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కరోనా రహితంగా పేర్కొన్న గోవాలో గత నెల నుంచి వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. 

ఆదివారం కొత్తగా 64 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గోవాలో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 818కి చేరింది. ఇందులో 683 మంది చికిత్స పొందుతుండగా 135 మంది కోలుకున్నారు. ఆదివారం ఆరుగురు కరోనా రోగులను డిశ్చార్జ్‌ చేశారు. మరోవైపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటి నుంచి గోవాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఈ రైళ్లను నిలుపవద్దని సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఇటీవల రైల్వేను కోరారు. logo