శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 17:00:32

క్యాసినోల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన గోవా క్యాబినెట్‌

క్యాసినోల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన గోవా క్యాబినెట్‌

హైద‌రాబాద్‌:  క్యాసినోల‌ను మ‌ళ్లీ తెరిచేందుకు గోవా రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది.  న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి క్యాసినోల‌ను తెర‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు  సీఎం ప్ర‌మోద్ వెల్ల‌డించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ క్యాసినోల‌ను రీఓపెన్ చేయ‌నున్నారు.  గోవాలో సుమారు ఆరు ఆఫ్‌షోర్‌, డ‌జ‌న‌కుపైగా ఆన్‌షోర్ క్యాసినోలు ఉన్నాయి.  భారీ ప‌డ‌వ‌‌ల్లో ఉన్న ఆన్‌షోర్ క్యాసినోలు గోవాలో చాలా ఫేమ‌స్‌.  మార్చిలో వైర‌స్ విజృంభించ‌డంతో ఆ నెల నుంచే క్యాసినోల‌ను మూసివేశారు.  దీంతో గోవా టూరిజం కూడా ప‌డిపోయింది.  అయితే 50 శాతం సామ‌ర్థ్యంతో క్యాసినోల‌ను ఆప‌రేట్ చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు.  రాష్ట్ర హోంశాఖ ఇచ్చిన నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. క్యాసినోల‌ను తెర‌వాలంటూ సీఎం ప్ర‌మోద్ సావంత్ వెల్ల‌డించారు.