బుధవారం 02 డిసెంబర్ 2020
National - Apr 14, 2020 , 12:47:09

ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నా: గోవా సీఎం

ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నా: గోవా సీఎం

పనాజీ: కొవిడ్-19 విస్త‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మోదీ ఇవాళ జాతినుద్ధేశించి ప్రసంగించిన అనంతరం గోవా సీఎం ట్విటర్లో స్పందించారు. గోవా ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ కోవిడ్-19పై మరింత బలంగా పోరాడుతుందని ఆయ‌న‌ పేర్కొన్నారు. గోవా ఆరోగ్యశాఖ‌ మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సదానంద కూడా లాక్‌డౌన్ పొడింపు నిర్ణయాన్ని స్వాగతించారు. 21 రోజుల లాక్‌డౌన్ సందర్భంగా సహకరించినట్టుగానే ప్రజలంతా ఇప్పుడు కూడా సహకరించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..