బుధవారం 02 డిసెంబర్ 2020
National - Aug 19, 2020 , 16:17:40

గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి గోవా సీఎం ఘ‌న‌స్వాగ‌తం

గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి గోవా సీఎం ఘ‌న‌స్వాగ‌తం

ప‌నాజీ : గోవా గ‌వ‌ర్న‌ర్‌గా మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్ ఇటీవ‌లే ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి బుధ‌వారం గోవాకు వెళ్లారు. అక్క‌డి ద‌బోలిం ఎయిర్‌పోర్టులో గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్‌.. గ‌వ‌ర్న‌ర్ కోశ్యారికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. గోవా గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్‌ను మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ గా బ‌దిలీ చేస్తూ రాష్ర్టప‌తి భ‌వ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.