శనివారం 11 జూలై 2020
National - Jul 01, 2020 , 06:56:31

బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా

బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా

పనాజి: గోవాలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దక్షిణ గోవాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా సోకిందని సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. గత రెండు రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. దీంతో ఆయనను చికిత్స కోసం ఈఎస్‌ఐ దవాఖానకు తరలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు రెట్టింపు చేస్తున్నామని, ప్రజలందరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం వటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేనట్లయితే రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.  

ఇప్పటికే రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరోనా బారిన పడ్డారు. గోవాలో ఇప్పటివరకు 1315 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 64 కొత్త కేసులు నమోదయ్యాయి.


logo