సోమవారం 30 మార్చి 2020
National - Feb 10, 2020 , 01:40:41

సీఏఏను వెనక్కి తీసుకోవాలి గోవా ఆర్చ్‌బిషప్‌ డిమాండ్‌

సీఏఏను వెనక్కి తీసుకోవాలి గోవా ఆర్చ్‌బిషప్‌ డిమాండ్‌

పనాజి: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తక్షణమే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని గోవా, డామన్‌ ఆర్చ్‌బిషప్‌ రెవ్‌ ఫిలిప్‌ నెరి ఫెర్రా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అసమ్మతి తెలిపే హక్కును అణచివేయడాన్ని ఆపాలన్నారు. దేశవ్యాప్త ఎన్నార్సీ (జాతీయ పౌర జాబితా), ఎన్పీఆర్‌ (జాతీయ జనాభా పట్టిక) అమలు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్‌ స్పందిస్తూ.. గోవా ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సీఏఏకు మద్దతునిస్తున్నారని, ఆర్చ్‌బిషప్‌ ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, ఆరెస్సెస్‌ అజెండాను తిప్పికొట్టేందుకు పౌరసమాజం, చదువుకున్న యువత గ్రామాలకు వెళ్లాలని సినీనటుడు సుశాంత్‌సింగ్‌ కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆదివారం ముంబైలోని హజ్‌ హౌజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత గడ్డ నుంచి మతతత్వం పోవాలని, పోరాటం ద్వారానే సీఏఏని అడ్డుకోగలమన్నారు.


logo