గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 21:55:25

ఫావిపిరావిర్‌ మూడవ దశ క్లీనికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ప్రకటించిన గ్లెన్‌మార్క్‌

 ఫావిపిరావిర్‌ మూడవ దశ క్లీనికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ప్రకటించిన గ్లెన్‌మార్క్‌

 ఢిల్లీ : యాంటీ వైరల్‌ ఔషధం ఫవిపిరవిర్‌ ఔషధ సామర్థ్యంపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఫార్మాసూటికల్స్  కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. భారత్‌లోని కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులపై ఈ ఔషధం ఎలా పని చేస్తుందనే కోణంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గత నెలలోనే ఫవిపిరవిర్‌ యాంటీ వైరల్‌ ట్యాబెట్ల పని తీరుపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు అనుమతులు ఇచ్చింది. దేశంలోనే మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు చేరుకున్న తొలి కంపెనీ తమదే అని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. ఈ అధ్యయనం కోసం 10కి పైగా ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నమోదు చేసుకున్నాయని పేర్కొంది.

ఆగస్టు నాటికి ఈ అధ్యయనం పూర్తవుతుందని వెల్లడించింది. కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులకు చికిత్స వ్యవధి గరిష్ఠంగా 14 రోజులు, అధ్యయన వ్యవధి 28 రోజుల వరకు ఉంటుందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. ఈ అధ్యయనానికి ప్రిన్సిపల్‌ ఇన్విస్టిగేటర్స్‌లో ఒకరైన డాక్టర్‌ జహీర్‌ ఉద్వాదియా మాట్లాడుతూ ‘‘ భారతీయ ఫావిపిరావిర్‌ అధ్యయన  ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మహమ్మారి తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఈ ట్రయల్‌ను చేశాము. తొలి ఫలితాలను స్వతంత్య్రంగా పర్యవేక్షించే అవకాశం నాకు కలిగింది. ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఫావిపిరావిర్‌ అందుకున్న రోగులు త్వరగా కోలుకోవడం గమనించామని ఆయన పేర్కొన్నారు. 


logo