సోమవారం 06 జూలై 2020
National - May 30, 2020 , 17:20:45

శృంగార వాంఛ అదుపులో పెట్టుకోలేక ఏం చేశాడో తెలుసా?

శృంగార వాంఛ అదుపులో పెట్టుకోలేక ఏం చేశాడో తెలుసా?

చెన్నై : శృంగార కోరికలు కలిగినప్పుడు శరీరమంతా మత్తుగా ఉంటుంది. ఆ సమయంలో కోరికలను అదుపులో పెట్టుకోవడం కష్టమే. కొందరు ఆ వాంఛను అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకొందరైతే విచిత్రమైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు.

తమిళనాడు నాగపట్టణం జిల్లాలోని నాగోర్‌కు చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు.. తన శృంగార కోరికను అదుపులో పెట్టుకోలేకపోయాడు. మే 26వ తేదీన తన మలద్వారం నుంచి ఓ మద్యం బాటిల్‌(గ్లాస్‌తో తయారైన) లోపలికి చొప్పించుకున్నాడు. ఆ తర్వాత నుంచి రెండు రోజుల పాటు అతనికి కడుపుతో పాటు మలద్వారంలో భరించలేని నొప్పి వచ్చింది. ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు. బాటిల్‌ను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీ లేక మే 28వ తేదీన బాధిత వ్యక్తి డాక్టర్లను సంప్రదించాడు. డాక్టర్లు ఎక్స్‌రే చేయగా.. పెద్ద పేగులో మద్యం బాటిల్‌ను గుర్తించారు. ఆ యువకుడికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి.. రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. మలద్వారం ద్వారానే బాటిల్‌ను బయటకు తీశారు. 

ఈ సందర్భంగా డాక్టర్‌ పాండియరాజ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి కేసును ఎక్కడా చూడలేదన్నారు. ఒక వేళ గ్లాస్‌ బాటిల్‌ పేగు లోపల పగిలి ఉంటే ప్రమాదం పొంచి ఉండేది. శస్త్రచికిత్స ద్వారా కూడా ఆ గ్లాస్‌ ముక్కలను తీయడం కష్టంగా ఉండేది. అదృష్టవశాత్తు ఆ బాటిల్‌ పగలలేదు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్‌ తెలిపారు. 


logo