మీలాంటి మంత్రులు కావాలి
మంత్రి కేటీఆర్‌కు వెస్ట్‌బెంగాల్ వాసి ట్వీట్
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ట్విట్టర్లో నిరంతరం అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కావాలన్నా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలన్నా ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే సాయమందుతున్నది. బాధితులు ఏ రాష్ర్టానికి చెందినవారైనా స్పందిస్తున్న కేటీఆర్ చర్యలకు పలువురు ఫిదా అయిపోతున్నారు. సోమవారం వెస్ట్‌బెంగాల్ రాష్ర్టానికి చెందిన అభినవ్ భట్టాచార్య మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌చేశారు. ‘కేటీఆర్.. మీరు మానవులేనా లేక సూపర్ పవర్స్ ఉన్న బోటా? దయచేసి మీ ప్లాస్మాను ఇతర రాజకీయ నాయకులు, మంత్రులకు ఇవ్వండి. ఎందుకంటే మీలాంటి మంత్రులు కావాలి. మీకు, మీ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీసులు ఉండాలి. లవ్ ఫ్రమ్ వెస్ట్‌బెంగాల్’ అంటూ ట్వీట్ చేశాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈఆర్ ఆకిబ్ సైతం కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కేటీఆర్ సర్ మీ లాంటి లీడర్ జమ్ముకశ్మీర్‌లోనూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ సర్ అంటూ ట్వీట్ చేశాడు.