శుక్రవారం 05 జూన్ 2020
National - Jan 15, 2020 , 01:37:26

ప్రభుత్వ స్కూళ్లకు బాలికలు.. ప్రైవేటుకు బాలురు

ప్రభుత్వ స్కూళ్లకు బాలికలు.. ప్రైవేటుకు బాలురు
  • 14వ వార్షిక విద్యా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: నాలుగు నుంచి ఎనిమిదేండ్ల వయసున్న పిల్లల్లో సుమారు 90 శాతంపైగా ఏదో ఒక విద్యాసంస్థలో చేరుతున్నారని 14వ వార్షి క విద్యా నివేదిక (ఏఎస్‌ఈఆర్‌) పేర్కొంది. కాగా, వీరిలో ఎక్కువ శాతం మంది బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో, అదే గ్రూపు వయసు బాలురు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారన్నది. 4-5 ఏండ్ల వయసున్న చి న్నారుల్లో 56.8% మంది బాలికలు, 50.4% మంది బాలురు ప్రభుత్వ పాఠశాలల్లో, 43.2 శాతం మంది బాలికలు, 49.6% మంది బాలురు ప్రైవేట్‌ స్కూళ్లలో చేరుతున్నట్లు తెలిపింది. 6-8 ఏండ్ల వయసు పిల్లల్లో ఈ వ్య త్యాసం చాలా ఎక్కువగా ఉన్నదని, 61.1% మంది బాలికలు, 52.1% మంది బాలురు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నట్లు వివరించిం ది. 24 రాష్ర్టాల్లోని 26 జిల్లాల పరిధిలో 4-8 మధ్య వయసున్న 36 వేల మంది పిల్లలపై సర్వే నిర్వహించిన ఏఎస్‌ఈఆర్‌- 2019 నివేదికను మంగళవారం విడుదల చేసింది. నాలుగేండ్ల వయసున్న చిన్నారుల్లో 91.3% మంది స్కూళ్లకు వెళ్తున్నారని తెలిపింది. చిన్న వయస్సులోనే పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు రాణిస్తున్నారని, చదువుకున్న తల్లులు ఉన్న పిల్లలు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ల లో చేరుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను మరింతగా పటిష్ఠపరచాలని నివేదిక సూచించింది.


logo