బుధవారం 20 జనవరి 2021
National - Jan 14, 2021 , 12:09:57

15 ఏండ్ల‌కే పిల్ల‌ల‌ను కంటారు క‌దా.. ‌నోరు జారిన కాంగ్రెస్ నేత‌

15 ఏండ్ల‌కే పిల్ల‌ల‌ను కంటారు క‌దా.. ‌నోరు జారిన కాంగ్రెస్ నేత‌

భోపాల్ : అమ్మాయిల వివాహ వ‌య‌సుపై కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి స‌జ్జ‌న్ సింగ్ వ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలు, మ‌హిళ‌ల‌పై నేరాల నియంత్ర‌ణ‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ స‌మ్మాన్ పేరిట అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అమ్మాయిల వివాహ వ‌య‌సును ప్ర‌స్తుతం ఉన్న 18 ఏండ్ల నుంచి 21 ఏండ్ల‌కు పెంచాల‌ని సీఎం అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌న్ సింగ్ వ‌ర్మ స్పందిస్తూ అమ్మాయిల్లో 15 ఏండ్ల‌కే ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ప్రారంభ‌మ‌వుతోంది. అలాంట‌ప్పుడు వారి పెళ్లి వ‌య‌సును 18 నుంచి 21 ఏండ్ల‌కు ఎందుకు పెంచాలి? 15 ఏండ్లు దాటితే అమ్మాయిలు పెళ్లికి అర్హ‌త సాధించిన‌ట్టేన‌ని కాంగ్రెస్ నాయ‌కుడు పేర్కొన్నారు.

వ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయ‌న‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఒక్క మ‌ధ్య‌ప్ర‌దేశ్ అమ్మాయిలనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మాయిల‌ను కించ‌ప‌రిచే విధంగా వ‌ర్మ మాట్లాడార‌ని బీజేపీ నాయ‌కులు ధ్వ‌జ‌మెత్తారు. దేశ మ‌హిళా లోకానికి వ‌ర్మ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు. 


logo