శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 15:33:52

క్యాన్సర్‌ రోగులకు జుట్టు దానం

క్యాన్సర్‌ రోగులకు జుట్టు దానం

చెన్నై : క్యాన్సర్‌ రోగుల పట్ల తమిళనాడుకు చెందిన ఓ ప్రయివేటు కాలేజీ విద్యార్థినులు మానవతా దృక్పథం చూపించారు. క్యాన్సర్‌ నిర్ధారణ అయిన వెంటనే ఆ రోగులకు జుట్టును కట్‌ చేస్తారు. అలాంటి రోగులకు జుట్టు దానం చేసి వారిలో ఆనందాన్ని నింపాలనే సంకల్పంతో విద్యార్థినులు ముందకు వచ్చారు. కోయంబత్తూరులోని ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థినులు.. తమ జుట్టును క్యాన్సర్‌ రోగులకు దానంగా ఇచ్చారు. ఈ జుట్టుతో విగ్‌లను తయారు చేసి క్యాన్సర్‌ పేషెంట్లకు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థినులు మాట్లాడుతూ.. క్యాన్సర్‌ రోగులకు ఆర్థికంగా సహాయం చేయలేము. వారు వెంట్రుకలు లేక బాధపడుతుంటారు. కాబట్టి తమ జుట్టును దానం చేసి.. వారిలో ఆనందాన్ని నింపాలనుకున్నామని చెప్పారు. క్యాన్సర్‌ రోగుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించిన విద్యార్థినులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.logo