శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 02:37:54

దేవ్‌బంద్‌..ఉగ్రవాదుల గంగోత్రి

దేవ్‌బంద్‌..ఉగ్రవాదుల గంగోత్రి
  • కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
  • స్వాతంత్య్ర సమరయోధుల కర్మభూమి అన్న స్థానిక ఎంపీ

షరాన్‌పూర్‌: కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్‌ పట్టణాన్ని ఉగ్రవాదుల పుట్టినిల్లుగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అక్కడి నుంచే వచ్చాడని పేర్కొన్నారు. యూపీలోని షరాన్‌పూర్‌లో బుధవారం జరిగిన సీఏఏ అనుకూల ప్రదర్శనలో గిరిరాజ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవ్‌బంద్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసనల గురించి ప్రస్తావించగా.. ‘దేవ్‌బంద్‌ ప్రాంతం ఉగ్రవాదులకు గంగోత్రి వంటిదని నేను గతంలోనే చెప్పాను. హఫీజ్‌ సయీద్‌ వంటి పెద్ద ఉగ్రవాదులు అక్కడి నుంచే వచ్చారు’ అని పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం మరో ఖలీఫా ఉద్యమం వంటిదన్నారు. 


కేంద్రమంత్రి వ్యాఖ్యలను షరాన్‌పూర్‌ ఎంపీ హాజీ ఫజ్లూర్‌ రెహాన్‌ ఖం డించారు. దేవ్‌బంద్‌ను స్వాతంత్య్ర సమరయోధుల కర్మభూమిగా అభివర్ణించారు. దేవబంద్‌కు చెందిన ఉలేమాలు స్వాతంత్య్రం కోసం పోరాడారని, జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. కాగా, గిరిరాజ్‌ కండ్లు ద్వేషంతో మూ సుకుపోయాయని, ఉగ్రవాదులకు ముడిపెడుతూ పవిత్రమైన గంగోత్రిని అవమానిస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ మసూద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


logo