శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 14:09:29

గిల్గిట్-బాల్టిస్తాన్ లో‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం

గిల్గిట్-బాల్టిస్తాన్ లో‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం

గిల్గిట్-బాల్టిస్తాన్‌ : న్యాయపరమైన ఆందోళనలు, భారీ నిరసనల నడుమ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ‌లో ఆదివారం శాసనసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 23 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 7,45,361 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు 1,141 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 577 కేంద్రాలను సున్నితమైనవిగా 297 కేంద్రాలను అతిసున్నితమైనవిగా గుర్తించారు.

ఎన్నికల నిర్వహణకు 15,900 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ప్రాంతీయ పాలనా అధికారి తెలిపారు. గిల్గిట్-బాల్టిస్తాన్ ‌తోపాటు పంజాబ్‌, కేపీకే, బలోచిస్థాన్‌ నుంచి భద్రతా సిబ్బందిని రప్పించినట్లు పేర్కొన్నారు. 23 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో  దాదాపు 330 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో  పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ (పీఎంఎల్‌-ఎన్‌) ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.