శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 02:15:38

వేర్పాటువాదికి పాక్‌ అందలం

వేర్పాటువాదికి పాక్‌ అందలం

  • గిలానీకి నిషానే పాకిస్థాన్‌ పురస్కారం
  • సర్కారుకు పాకిస్థాన్‌ సెనేట్‌ సిఫారసు
  • కశ్మీర్‌లో ఉగ్రహింసకు గిలానీయే సూత్రధారి

జమ్ము, జూలై 28: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తన దుష్టబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జమ్ముకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో కలిపేందుకు దశాబ్దాలపాటు అంతులేని కుట్రలకు పాల్ప డి ఉగ్రవాద హింసను ప్రోత్సహించిన వేర్పాటువాది సయ్యద్‌ అలీషా గిలానీకి పాకిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషానే-పాకిస్థాన్‌' ఇవ్వాలని ఆ దేశ ఎగువసభ (సెనేట్‌) పాక్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పాక్‌ పాఠశాల సిలబస్‌లో గిలానీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, ఇస్లామాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని కూడా సోమవారం తీర్మానం చేసింది. జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద పార్టీల కూటముల్లో శక్తిమంతమైన హురియత్‌ కాన్ఫరెన్స్‌లో 90 ఏండ్ల గిలానీ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. గత నెలలోనే ఆయన హురియత్‌ కాన్ఫరెన్స్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హురియత్‌లో ఐక్యత కొరవడటంతోనే తాను వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు. 2010నుంచి ఆయన ఎక్కువకాలం గృహనిర్బంధంలోనే ఉన్నారు.


logo