గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:01:59

780 కిలోల చేప 50 వేల‌కు అమ్ముడు‌పోయింది

780 కిలోల చేప 50 వేల‌కు  అమ్ముడు‌పోయింది

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లోని దిఘా తీర ప్రాంతంలో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ చేప వ‌ల‌లో చిక్కింది. 780 కిలోల బ‌రువున్న చేప వ‌ల‌లో చిక్కిన‌ట్లు జాల‌ర్లు తెలిపారు. ఏనుగు చెవి మాదిరి ఉండే ఈ చేప‌ను శంక‌ర్ అని స్థానికంగా పిలుస్తారు. చేప పొడువు 8 ఫీట్లు, వెడ‌ల్పు 5 ఫీట్లుగా ఉంది. ఈ చేప‌ను రూ. 50 వేల‌కు అమ్మిన‌ట్లు జాల‌ర్లు చెప్పారు. ఇంత భారీ బ‌రువున్న చేప‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్ప‌డు ప‌ట్ట‌లేద‌ని ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. 780 కిలోల బ‌రువున్న చేప‌ను చూసేందుకు జ‌నాలు అధిక సంఖ్య‌లో గుమిగూడారు. ఈ చేప ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అయింది. శంక‌ర్ చేప‌ను తినేందుకు బెంగాల్ ప్ర‌జ‌లు అమితంగా ఇష్ట‌ప‌డుతారు. దిఘా తీర ప్రాంతంలోనే ఈ ఏడాది మార్చిలో 300 కేజీల చేప‌ను ప‌ట్టుకున్నారు. logo