ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 09:58:41

వేధింపుల‌కు గురైన మ‌హిళ‌తో రాఖీ క‌ట్టించుకుంటేనే బెయిల్‌..

వేధింపుల‌కు గురైన మ‌హిళ‌తో రాఖీ క‌ట్టించుకుంటేనే బెయిల్‌..

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఓ గ‌మ్మ‌త్తు ష‌ర‌తు విధించింది.  ఇండోర్‌కు చెందిన విక్ర‌మ్ బాగ్రీ అనే వ్య‌క్తి వేధింపుల కేసులో బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే జ‌స్టిస్ రోహిత్ ఆర్య నేతృత్వంలో ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం దానికి ఓ ష‌ర‌తు పెట్టింది.  వేధింపుల‌కు గురైన‌ మ‌హిళ చేత‌ రాఖీ క‌ట్టించుకుంటేనే .. బెయిల్ ఇస్తామంటూ విక్ర‌మ్‌కు కోర్టు ష‌ర‌తు పెట్టింది.  రాఖీ క‌ట్టిన‌ ఆ మ‌హిళ‌కు 11వేల న‌గ‌దు కానుక కూడా ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. భార్య‌తో క‌లిసి ఉజ్జ‌యినిలో ఉన్న ఆ మ‌హిళ ఇంటికి వెళ్లాల‌ని, ‌రాఖీ క‌ట్టాలంటూ ఆమెను కోరాల‌ని ఇండోర్ కోర్టు తీర్పులో పేర్కొన్న‌ది. స్వీటు బాక్సుల‌తో వెళ్లి .. రాఖీ క‌ట్టమ‌‌ని అడ‌గాల‌ని, తానెప్పుడూ అన్న‌య్య‌లా అండ‌గా ఉంటాన‌ని ఆమెకు హామీ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.  వేధింపుల‌కు గురైన మ‌హిళ కుమారుడికి కూడా 5వేలు ఇవ్వాల‌ని సూచించింది.
logo