మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 15:48:13

మూడు నెలల తర్వాత జర్మనీలో అత్యధిక కరోనా కేసులు

మూడు నెలల తర్వాత జర్మనీలో  అత్యధిక కరోనా కేసులు

జర్మనీలో  మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల తర్వాత ఒక రోజులో  అత్యధికంగా  కరోనా కేసులు నమోదైనట్లు జర్మనీ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దేశంలో కొత్తగా 1,045 కేసులు నమోదయ్యాయని రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.  మే 7 తర్వాత ఒక రోజులో 1000కి పైగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌ ప్రారంభంలో   కేసుల తీవ్రత  ఎక్కువగా ఉన్నది.

ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌   ధరించాలని అధికారులు కోరారు.  జర్మనీలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. దేశంలో ఇప్పటి వరకు 2,14,104 కరోనా కేసులు నమోదు కాగా 9,245 మంది చనిపోయారు. 


logo