ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 10:38:47

55 రోజులుగా ఎయిర్‌పోర్టు ప‌రిసరాల్లోనే నిరీక్ష‌ణ‌

55 రోజులుగా ఎయిర్‌పోర్టు ప‌రిసరాల్లోనే నిరీక్ష‌ణ‌

న్యూఢిల్లీ: జ‌ర్మ‌న్ దేశానికి చెందిన ఒక వ్య‌క్తి లాక్‌డౌన్ కంటే ముందే ప‌ర్యాట‌కుడిగా భార‌త్‌కు వ‌చ్చాడు. అత‌ను దేశంలో తన టూర్ పూర్తి చేసుకుని ఢిల్లీకి చేరుకునే స‌రికి లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయన ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లోనే ఉండిపోయాడు. ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లోనే స్నాన‌పానాదులు చేస్తూ, దొరికిన ఆహారం తింటూ 55 రోజులు నిరీక్షించాడు. ఎట్ట‌కేలకు అత‌ని నిరీక్ష‌ణ ఫ‌లించ‌డంతో ఈ ఉద‌యం కేఎల్ఎం విమానంలో భార‌త్ నుంచి ఆమ‌స్ట‌ర్‌డామ్‌కు బ‌య‌లుదేరి వెళ్లాడు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo