గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 19:20:21

కరోనా సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్‌ సీఎం

కరోనా సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్‌ సీఎం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని ఓ క్రికెట్‌ మైదానంలో 750 పడకలతో ఏర్పాటు చేసిన కరోనా సంరక్షణ కేంద్రాన్ని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ గురువారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చికిత్స పొందే కరోనా రోగులకు అత్యవసర సామగ్రితోపాటు మూడుపూటల భోజనం ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. నిష్ణాతులైన వారితో నిత్యం యోగా, మెడిటేషన్‌ తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తారని ఇందుకోసం ఓ భారీ ఎల్‌ఈడీ తెరను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శానిటేషన్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 2642కరోనా కేసులు నమోదుకాగా ఇందులో 845 యాక్టివ్‌ కేసులున్నాయని, 1,745మంది కోలుకున్నారని, 35మంది మృతి చెందారని వెల్లడించారు. logo